చిట్ ఫండ్స్ బాధితులకు అండగా ఉంటా
On
- చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ తస్లీమా వెల్లడి
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా తస్లీమా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యామినిని ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ చేసింది. గతంలో ములుగు, మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా తస్లీమా పనిచేశారు. ఈ సందర్భంగా తస్లీమా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్ ఫండ్స్ భాదితులకు తాను అండగా ఉంటానని,ఎవరు దళారుల మాటలు నమ్మవద్దని,భాదితులు నేరుగా కార్యాలయంలో తనను సంప్రదించాలని సూచించారు.చిట్ ఫండ్స్ ఖాతాదారులకు భాదితులకు ప్రభుత్వ మార్గదర్శకాలతో నష్ట పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహేష్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



