భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అన్నదాన సత్రముపై అసత్య ప్రచారాలు – సీసీటీవీ ఆధారాలతో ఖండించిన దేవస్థానం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అన్నదాన సత్రముపై అసత్య ప్రచారాలు – సీసీటీవీ ఆధారాలతో ఖండించిన దేవస్థానం

విశ్వంభర, భద్రాచలం || ది.17.01.2026 న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అన్నదాన సత్రము నందు భక్తులకు భోజనము మధ్యాహ్నం గం||2:00 ల వరకే అందజేస్తున్నారని, వందలాది మంది భక్తులు తిరిగి వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ది.18.01.2026 న తెలిసిన నేపథ్యంలో నిజ నిర్ధారణ కొరకు అదేరోజు మధ్యాహ్నం గం||2:30 ని||లకు కార్యనిర్వహణాధికారి వారు స్వయంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అన్నదాన సత్రమునకు వచ్చి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా భక్తులకు ఈ విషయమును తెలియజేసిన చాట్ల వెంకటేశ్వర్లు, దుమ్ముగూడెం అనే వ్యక్తి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన సిబ్బంది కాదని, తాను అంగవైకల్యం కలవాడినని చెప్పుకుంటూ ప్రతిరోజూ దేవస్థాన అన్నదాన సత్రములో భోజనం చేస్తున్నట్లు తెలిసింది.అదేవిధంగా, సదరు తేదీన మధ్యాహ్నం గం||3:30 ని||ల వరకు భక్తులకు భోజన సదుపాయం కల్పించబడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్పష్టంగా నిర్ధారణ అయింది. అయితే, రైస్ అయిపోయిన సందర్భంలో మరలా రైస్ వండుటకు కొంత సమయం పట్టిన వేళ వచ్చిన భక్తులకు మధ్యాహ్నం గం||2:00 ల వరకే భోజనం అని చెప్పి వారిని తిరిగి పంపి, ఉద్దేశ్యపూర్వకంగానే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంపై దుష్ప్రచారం చేసినట్లు గమనించడమైంది. ఈ విధంగా దేవస్థాన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రవర్తించినందున సదరు వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేయవలసిందిగా ఫిర్యాదు కూడా చేయుట జరిగింది.
శ్రీస్వామి వారి దర్శనార్థమై విచ్చేయు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, తదనుగుణంగా అన్నప్రసాదం తయారు చేస్తూ, వచ్చే భక్తులందరికీ సమయం మరియు టోకెన్‌తో సంబంధం లేకుండా నిరంతర అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయబడుతున్నదని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన భక్తులందరికీ కూడా సుమారు మధ్యాహ్నం గం||3:30 ని||ల వరకు అన్నప్రసాదం అందజేయబడినదని వెల్లడించింది.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంపై జరుగుతున్న పై దుష్ప్రచారం పూర్తిగా దురుద్దేశ్యపూర్వకమైనదిగా, ఇది సత్యదూరమైందిగా దేవస్థానం స్పష్టం చేసింది.శ్రీరామ కార్యంలో…సం/- కె. దామోదర్ రావు కార్యనిర్వహణాధికారి

Tags: