అంప్రతి ఇంటిస్వచ్ఛమైన తాగునీరు కి దించాలి 

అంప్రతి ఇంటిస్వచ్ఛమైన తాగునీరు కి దించాలి 

  • పల్ చైర్మన్మున్సి

 

- విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ మిషన్ భగీరథ ట్యాంక్‌ను సందర్శించి  ప్రతి ఇంటికి స్వచ్ఛమైన  తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.  శనివారం మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ డి.ఈ., వాటర్ టెక్నికల్ టీమ్‌తో కలిసి నీటి శుద్ధి ఫిల్టర్ యంత్రాంగాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్శనలో 38వ వార్డు కౌన్సిలర్  ఇంద్రకుమార్ , 35వ వార్డు కౌన్సిలర్  సోము సుందర్ పాల్గొన్నారు. అలాగే తాగు నీటి సరఫరా, శుద్ధి ప్రక్రియ జరుగుతున్న విధానం, తాగునీటిలో పి హెచ్  స్థాయి వంటి అంశాలను పరిశీలించి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సేవల్లో మరింత మెరుగుదల తీసుకురావాలని చైర్‌పర్సన్  అధికారులను ఆదేశించారు.

Tags: