తండాలకు మెరుగైన రహదారులు ..  రైతులకు పెట్టుబడి సాయం 

  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

విశ్వంభర, హుస్నాబాద్:  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాజులతండాలో రూ.2.10 కోట్ల అంచనా వ్యయంతో పంజాగుట్ట తండా నుంచి రాజులతండా వరకు నిర్మించనున్న బీటీ రహదారి పనులకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తండాల సమగ్ర అభివృద్ధికి మెరుగైన రహదారి సౌకర్యాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, రైతులు, అత్యవసర వైద్య సేవలు పొందే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రజలు కూడా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం దుబ్బతండాకు చెందిన మాజీ జవాన్ గుగులోత్ నరసింహ నాయక్ విగ్రహానికి మంత్రి పొన్నం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ జవాన్ల త్యాగాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

మీర్జాపూర్ రైతు వేదికలో మంత్రి పొన్నం...

Read More వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. పీహెచ్‌సీ రిపేర్లకు రూ.14.30 లక్షలు 

 హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ రైతు వేదికలోతెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు రైతు భరోసా నిధులను విడుదల చేయగా, హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామ రైతు వేదిక నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతు భరోసా ద్వారా రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/better-roads-to-thandas-%C2%A0investment-help-for-farmers/article-17472

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.