సీలింగ్ భూములకు పట్టాలు ఇవ్వాలి

విశ్వంభర, ఇల్లందు : మామిడిగుండాల సీలింగ్ భూములను సాగు చేస్తున్న ఆదివాసి, గిరిజన పేద రైతులకు ప్రభుత్వం శాశ్వత పట్టా హక్కులు కల్పించాలి అని మామిడిగుండాల భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీలింగ్ భూములపై వెంటనే సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి, సాగు చేస్తున్న రైతులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అండతో పేద రైతులు సాగు చేస్తున్న భూముల్లో యంత్రాలతో కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం అన్యాయమని విమర్శించారు. భూములను రక్షించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ఆవునూరి మధు, మెంతన సంజీవరావు, అబ్దుల్ నబీ, కే. సారయ్య, బానోతు ఊక్లా, ఉపేందర్ యాదవ్, దుర్గారపు వీరభద్రం, నంగారాబేరి ఆంజనేయులు, మంతెన వసంతరావు, అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sealing-lands-should-be-given-rails/article-17474

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.