మరో భూకబ్జా బాగోతం
విశ్వంభర,హనుమకొండ జిల్లా:-గ్రేటర్ వరంగల్ ఏనుమాముల పరిధి NTR నగర్ సర్వే నెంబర్ 170/B2 లోని 1.20గు. గల భూమిలో సుమారు ఇరవై సంవత్సరాలుగా నాతి శరత్ అను వ్యక్తి కబ్జాలో ఉంటూన్నారు. ఇప్పుడు దూడెం రాజేష్ అనే వ్యక్తి మరియు మరికొందరు నఖిలీ డాక్యుమెంట్ లు సృష్టించి తన భూమిని ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని నాతి శరత్ మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది ఈ భూమిపై అక్రమ కబ్జా కు ప్రయత్నించి కోర్టులో విఫలమైనారని ఇప్పుడు రాజేష్ అను వ్యక్తి ఏకంగా నిర్మాణం చేపడుతున్నారని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని నాతి శరత్ వాపోతున్నారు. NTR నగర్ స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకుని నాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు తన గోడు విన్నవించుకున్నట్లు శరత్ తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి వెంటనె ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుకుంటున్నట్లు శరత్ తెలిపారు.