సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
On
సబ్ఇన్పక్టర్ ఎస్ కృష్ణయ్య
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) సబ్ఇన్పక్టర్ ఎస్ కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు స్పందించరాదని, పండుగల సీజన్లో షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదని అన్నారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటలను నమ్మరాదని, సైబర్ నేరాలకు గురైతే 1930 కి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయరాదని, సందేశాలకు స్పందించరాదని తెలిపారు