పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ 110 వ జయంతి. - జిల్లా పద్మశాలి నాయకులు

బాపూజీ ఆశయ స్పూర్తితో ముందుకు సాగాలి. 

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ 110 వ జయంతి. - జిల్లా పద్మశాలి నాయకులు

విశ్వంభర, యదాదారి భువనగిరి /భువనగిరి :-  పట్టణంలోని జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ  110 వ జయంతి సందర్భంగా బాపూజీ  చిత్రపటానికి పద్మశాలి,  జిల్లా చేనేత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేతలకు చేసిన సేవలను కొనియాడుతూ,బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు బింగి వైకుంఠం, ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీధర్, కోశాధికారి శ్రీరామ్ అత్తయ్య మరియు చేనేత నాయకులు, కార్మికులు పాల్గొన్నారు..

Tags: