చిరస్మరణీయుడు అంబేద్కర్ 

చిరస్మరణీయుడు అంబేద్కర్ 

  •  ఎమ్మెల్యే బాలునాయక్

విశ్వంభర, చింతపల్లి : భారతదేశాన్ని అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసిన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో డా.బీ.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు అంబేడ్కర్ అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతో పాటు, మహిళా సాధికారతకు మరియు కార్మికుల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.‌ తెలంగాణ లోని ఇందిరమ్మ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతోందన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా మనం చేపట్టిన కుల గణన ద్వారా వనరులు మరియు అవకాశాలను జనాభా ప్రాతిపదికన అందరికీ సమానంగా పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణలో మరియు మానవ హక్కుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, డిసిసి ఉపాధ్యక్షులు ఎరుకల వెంకటయ్య గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ముచర్ల యాదగిరి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, నాంపల్లి సిఐ రాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎర్ర వెంకటయ్య, సర్పంచులు కాసారపు శ్వేతా శ్రీనివాస్, యాచారం యాది గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ ఎండి రెహనా సిద్దిబాబా, ఎమ్మార్పీఎస్ నాయకులు వింజమూరు కృష్ణ మాదిగ, ఎర్ర జగన్, ఎలిమినేటి నరసింహ, నల్లవెల్లి సదానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లంకి రాధా కిషన్, ఎండి రియాజ్ పాషా, గోవిందు రవికుమార్, వందనపు ఆంజనేయులు, కొప్పుల శ్రీను, ఎండి జాఫర్, గుణమోని కొండల్,  స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: