ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు : 

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు : 

  • సర్పంచ్ బొప్పిడి గోపాల్

విశ్వంభర, కడ్తాల్: వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎండలు అత్యధికంగా ఉండటంతో ప్రజలకు చల్లని నీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు. ప్రజలు ఎండలో తిరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.‌ ఎండల నేపథ్యంలో ప్రయాణికుల, బాటసారుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, వార్డు సభ్యులు హనుమంతు నాయక్, రామస్వామి, మంజుల, శోభ, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, తదితరులున్నారు.

Tags: