ఎండాకాలంలో నీటిని వృథా  చేయవద్దు 

ఎండాకాలంలో నీటిని వృథా  చేయవద్దు 

విశ్వంభర, రామన్నపేట: గృహాల ముందు మురుగు నీటిని నిల్వ ఉంచకుండా, అపరిశుభ్ర నీటితో అనారోగ్యాల పాలు కాకుండా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, ఎండాకాలంలో నీటిని వృధా చేయకుండా సక్రమంగా వాడుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గ్రామంలోని బోటిమీదగూడెంలో స్థానిక వార్డు సభ్యుడు మేకల జలందర్ తో కలసి ఇంటింటికి తిరిగి పలు సమస్యలు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నీటి సమస్య తలెత్తడంతో ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలు నీటిని వృధాగా పోనీయకుండా ఆదా చేస్తూ అందరికీ సరిపోయే విధంగా సహకరించాలని అన్నారు. గృహాల నుండి విడుదలైన మురికి నీరు నిల్వ ఉండంతో దోమలు, దుర్గంధంతో అనారోగ్యాలకు గురికావడం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, ఇంకుడు గుంతలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఎవరు నూతన గృహాల నిర్మాణాలు చేపట్టవద్దని, ప్రతి ఇంటికి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కారం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డు సభ్యుడు మేకల జలంధర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు

Tags: