కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెంటనే గోదావరి జలాలు విడుదల చేయాలి: బీఆర్ఎస్
విశ్వంభర, సూర్యాపేట: కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆయకట్టుకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపుతో కన్నెపల్లి పంప్‌హౌస్ పునరుద్ధరణను ఆలస్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేకుండా రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించకపోతే మాజీ సీఎంకెసిఆర్ , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ , మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.