ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి 

ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి 

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. 

అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేపలు, గొర్రెలపంపిణీ పేరిట వేలకోట్ల రూపాయలను తిన్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు. వందల ఎకరాలు ఉన్న వారికీ రైతుబంధు వేశారని 70వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదని కోమటిరెడ్డి  దుయ్యబట్టారు. 

Read More కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.

మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారంటూ ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ భోజనం చేయాలంటూ రూ.లక్ష వసూలు చేసేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం సోనియాగాంధీ కాళ్లు మొక్కారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్  చెప్పిన మాటలను గుర్తుచేశారు. పంద్రాగస్టుకు తాము రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా