మేడారంలో ఆకట్టుకుంటున్న సరికొత్త హంగులు

రూ. 150 కోట్లతో సర్కారు ఏర్పాట్లు

మేడారంలో ఆకట్టుకుంటున్న సరికొత్త హంగులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర 'సమ్మక్క-సారలమ్మ' మహా జాతరకు మేడారం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అడవి తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ మేడారం పరిసర ప్రాంతాలు సరికొత్త హంగులను అద్దుకున్నాయి.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర 'సమ్మక్క-సారలమ్మ' మహా జాతరకు మేడారం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అడవి తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ మేడారం పరిసర ప్రాంతాలు సరికొత్త హంగులను అద్దుకున్నాయి. ములుగు నుంచి తాడ్వాయి మీదుగా మేడారం వరకు సాగే దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది. జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గిరిజన సంప్రదాయాలు, ఆదివాసీల జీవనశైలిని ప్రతిబింబించేలా ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ములుగు, తాడ్వాయ్ వంటి ప్రాంతాల్లోని ప్రధాన చౌరస్తాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల పెయింటింగ్స్‌తో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.150 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేసింది. రహదారుల విస్తరణ, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులతో పాటు పర్యాటక హంగులను కూడా జోడించారు.

Read More మీర్ పేట్ లో దోమల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ..  మహాప్రభూ మమ్ముల్ని పట్టించుకోండి.. 

సెల్ఫీల సందడి
జాతర ప్రాంగణానికి చేరుకుంటున్న భక్తులు అక్కడి సుందర దృశ్యాలను చూసి మురిసిపోతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన కళాకృతుల వద్ద భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. వనదేవతల కొలువులో ఈసారి ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం కూడా తోడవ్వడంతో మేడారం సరికొత్త అందాలను సంతరించుకుంది.

Tags: medaram

Related Posts