పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
విశ్వంభర, ఫరూక్ నగర్ : నూటయాభై సంవత్సరాల చరిత్ర గల రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల, మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987-1988 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 36 ఏళ్ల తరువాత 80 మంది పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు.ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషించారు. పాత స్నేహితులు ఎక్కడో ఒకచోట కలిస్తే ఆ సంతోషం ఎంతో మధురమైనది. అలాంటిది ఎప్పుడో చదువుకుని చాలా ఏళ్ల తర్వాత కలిస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు. విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరు కనుకనే పూర్వ విద్యార్థులందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారని కొనియాడారు.అనంతరం ఉపాధ్యాయులకు పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.