ఇంగ్లండ్ లీగ్‌లో కావ్యా పాప జట్టు కొనుగోలు..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్ గ్రూప్, ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లోనూ తన ప్రస్థానాన్ని విస్తరించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్ గ్రూప్, ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లోనూ తన ప్రస్థానాన్ని విస్తరించింది. ఇంగ్లండ్‌లో నిర్వహించే ప్రముఖ టీ20 తరహా టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’లో లీడ్స్ కేంద్రంగా ఉన్న జట్టును సన్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ‘నార్తర్న్ సూపర్‌చార్జర్స్’గా ఉన్న ఈ జట్టుకు ఇకపై ‘సన్‌రైజర్స్ లీడ్స్’ అనే కొత్త పేరు పెట్టి రీబ్రాండ్ చేశారు. ఈ ఒప్పందం విలువ సుమారు 100 మిలియన్ యూరోలు ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఆధీనంలో ఉన్న ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలోకి వెళ్లింది. ‘ది హండ్రెడ్’ చరిత్రలో ఒక జట్టు పూర్తిస్థాయిలో ప్రైవేట్ సంస్థ చేతికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ స్పందిస్తూ, సన్‌రైజర్స్ అనేది కేవలం ఒక క్రికెట్ జట్టు మాత్రమే కాదని, అది అభిమానులతో ముడిపడ్డ భావోద్వేగ బంధమని తెలిపారు. హెడింగ్లీ స్టేడియాన్ని ఆరెంజ్ రంగుతో నింపుతూ, ధైర్యంగా, ఉత్సాహంగా ఆడే క్రికెట్‌ను అభిమానులకు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌లతో గుర్తింపు తెచ్చుకున్న సన్ గ్రూప్, ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదే బ్రాండ్‌ను విస్తరించింది.
ఈ కొత్త మార్పులు 2026 సీజన్ నుంచి అమల్లోకి రానున్నాయి. అదే ఏడాది నుంచి ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో ఆటగాళ్ల ఎంపిక విధానంలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. డ్రాఫ్ట్ విధానానికి బదులుగా వేలం పద్ధతిని ప్రవేశపెట్టనుండగా, ఆటగాళ్ల వేతనాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశముంది. ఇదిలా ఉండగా, ఈ లీగ్‌లో మరికొన్ని జట్లు కూడా పేర్లు మార్చుకోనున్నాయి. మాంచెస్టర్ ఒరిజినల్స్ ‘మాంచెస్టర్ సూపర్ జెయింట్స్’గా, ఓవల్ ఇన్విన్సిబుల్స్ ‘ఎంఐ లండన్’గా మారనున్నాయి. ఈ పరిణామాలన్నీ ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రభావం, గ్లోబల్ క్రికెట్‌లో భారత వ్యాపార సంస్థల విస్తరణకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి.



