అడ్డాకుల నుండి కౌకుంట్ల వరకు రోడ్డు పనులు కోసం వినతి
On
విశ్వంభర/ దేవరకద్ర:-మండలంలో పలు అభివృద్ధి శంకుస్థాపన పనులలో భాగంగా ఈరోజు రోడ్డు భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేవరకద్ర నియోజకవర్గానికి రాగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కౌకుంట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్& టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ రెడ్డి కలిసి అడ్డాకుల మండల కేంద్రం నుండి వయా మునగల్చేడ్, కౌకుంట్ల మండల కేంద్రం వరకు కలుపుతూ ఐదు కిలోమీటర్ల రోడ్డు పనులకై వినతి పత్రం అందజేశారు. ఈ రోడ్డు పనుల వలన నేషనల్ హైవే 44 కు రాకపోకులకు ఇబ్బంది కలగ కు oడా త్వరితగతిన చేరుకోవడానికి వీలు ఉంటుందని దేవరకద్రమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



