ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: సచిన్ సావంత్
On
విశ్వంభర, అంబర్‌పేట :రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి, సచిన్ సావంత్ అన్నారు. హైదరాబాదులో పలు ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) హెల్ప్‌డెస్క్‌లను శనివారం ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావుతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం అంబర్‌పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట డివిజన్‌లో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి, ఓటరు నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సచిన్ సావంత్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య విలువలకు ముప్పు ఏర్పడిందని, కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల పేర్ల తొలగింపు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. వి. హనుమంతరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. బీఎల్‌ఓలకు అవసరమైన వివరాలు అందించి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోత రోహిత్, శంభుల శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, రావుల సుధాకర్, గడ్డం శ్రీధర్ గౌడ్, సుధాకర్,
గరిగంటి శ్రీదేవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🕒 18 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/protection-of-voting-rights-is-the-responsibility-of-every-citizen/article-18825