ముందుగానే గుర్తిస్తే స్కోలియోసిస్ తీవ్రతను నివారించవచ్చు
విశ్వంభర, హనుమకొండ : స్కోలియోసిస్ (వెన్నెముక వంకర) వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తీవ్రమైన వెన్నెముక వైకల్యాలు, సంక్లిష్ట శస్త్రచికిత్సల అవసరాన్ని చాలావరకు నివారించవచ్చని యశోద హాస్పిటల్స్ స్పైన్ సర్జన్ డాక్టర్ మధు కిరణ్ తెలిపారు. స్కోలియోసిస్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా హనుమకొండ యశోద హాస్పిటల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్కోలియోసిస్ ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో కనిపిస్తుందని, భుజాలు అసమానంగా ఉండటం, నడుము లేదా తుంటి భాగం సమంగా లేకపోవడం, వెన్నెముక వంకరగా కనిపించడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని సూచించారు. ప్రారంభ దశలో ఫిజియోథెరపీ, బ్రేసింగ్ వంటి చికిత్సలతో సమస్యను నియంత్రించవచ్చని, నిర్లక్ష్యం చేస్తే వెన్నునొప్పి, ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం, శారీరక ఆకృతి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ రూపేష్ షిండే, అసిస్టెంట్ మేనేజర్ రమేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.