సురభి బిర్యానీ హోటల్ ప్రారంభించిన  ఎమ్మెల్యే నాయిని 

విశ్వంభర, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు సమీపంలో హుజురాబాద్ వెళ్ళే దారిలో నూతనంగా నిర్వాహకులు శ్రావణ్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేసిన సురభి బిర్యానీ హోటల్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి శుక్రవారం ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నాయిని 300 మందికి ఉచితంగా బిర్యానీ పొట్లాలు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కస్టమర్లకు మంచి శుచికరమైన,రుచికరమైన బిర్యానీ అందజేస్తామని తెలిపారు. ఒకసారి సురభి బిర్యానీ హోటల్ సందర్శించి బిర్యానీ రుచి చూడాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. ఒకసారి తింటే మళ్ళీ మళ్లీ  తినాలనిపిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ నిర్వాహకులు కిన్నెర దిలీప్ కుమార్, శ్రేయోభిలాషులు,బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-naini-started-surabhi-biryani-hotel/article-17846

Tags: