హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నా ప్టార్ హీరోయిన్

హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నా ప్టార్ హీరోయిన్

ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు

ప్రేక్షకులంతా "రాజా సాబ్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు రాజాసాబ్ హిట్ తర్వాత ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "రాజా సాబ్" ముందు సినిమా హరి హర వీరమల్లులో నేను రాకుమారి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఏంజెల్ గా కనిపించాను. ఈ రోల్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ వరకు కాకుండా మొత్తం కథ విన్నాను. కథ విన్నప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా దర్శకుడు మారుతి గారు చూపించారు. ఆ పాయింWhatsApp Image 2026-01-14 at 7.50.01 PMట్ యూనిక్ గా అనిపించింది.  నేను హరి హర వీరమల్లుతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర కూడా ఉండకపోయేది. ఆ టైమ్ లో రాజా సాబ్ మేకర్స్ బాగా సపోర్ట్ చేశారు. నన్ను సెట్ లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు నిధి అగర్వాల్ అంటే సెట్ లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు. పవన్ కల్యాణ్ గారితో హరి హర వీరమల్లులో నటించినప్పుడు ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. చాలా ధైర్యంగా ఉంటారు. ప్రభాస్ గారితో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. హిందీలో రెండు మూవీస్ చేస్తున్నా. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నా. ఇక్కడికి షిప్ట్ అవుతున్నా. నా బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలగన్నా. నేను కలగన్న కెరీర్ నే కొనసాగిస్తున్నా కాబట్టి కొత్తగా నేను కోరేది ఏమీ లేదు. హీరోయిన్ గా మంచి పర్పస్ ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.