విద్యార్థుల నమోదు పెంచాలి జిల్లా కలెక్టర్
- కళాశాలల్లో , పాఠశాలల్లో, కె.జి.బి.విలలో మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలి
- కళాశాలలు, అంగన్‌వాడీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
విశ్వంభర , మహబూబాబాద్: జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో, కె.జి.బి.వి లలో మౌలిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, కళాశాలలు, అంగన్‌వాడీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం లోని లబ్దిదారుల వివరాల నివేదికలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సంబందిత అధికారులతో అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలల్లో , పాఠశాలల్లో, కె.జి.బి.వి లలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, కరెంట్ వంటి పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని సంబందిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పలు మండలాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల లబ్దిదారుల వివరాల నివేదికలను ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన గృహాలు త్వరితగతిన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివిధ దశలలో ఉన్న నిర్మాణాల వివరాలను ఇవ్వాలని అన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను గుర్తించి ఇంటర్‌లో చేర్పించాలని, డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలన్నారు. కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. సిలబస్ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు పూర్తిచేయాలని అన్నారు. ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు భోదించాలని, ప్రతి నెల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో అవసమైన మెటీరియల్ కొనుగోలును కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వేగవంతం చేయాలని అన్నారు. అంగన్వాడీ టీచర్ల నియామకాన్ని త్వరగా పూర్తిచేయాలని అన్నారు. 3-6 సంవత్సరాల పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, గర్భిణులు, బాలింతలను కూడా నమోదు చేయాలని, ప్రీ ప్రైమరీ పిల్లల నమోదును వేగవంతం చేయాలని అన్నారు. ఎక్కడ కూడా జీరో నమోదు కేంద్రాలు ఉండకుండా పిల్లలను చేర్చుకోవాలన్నారు. కె.జి.బి.వి లలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అన్నారు. విద్యాశాఖ, ICDS, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని అన్నారు. అంగన్ వాడీల్లో ఉన్న పిల్లల ఎత్తు, బరువును, సామ్, మామ్ పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడటం మనందరి బాధ్యత. ప్రతి నెలా అంగన్‌వాడీల్లోని 0-6 సంవత్సరాల పిల్లల ఎత్తు, బరువును కచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. పిల్లల ఆహారంపై ప్రతి నెలా తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ (ఇంచార్జ్), జెడ్.పి సీ.ఈ.ఓ పురుషోత్తం, హౌసింగ్ ఈ.ఈ, డి.ఈ.ఓ సత్యనారాయణ, ఇంచార్జ్ డి.డబ్ల్యూ. ఓ శిరీష పాల్గొన్నారు.