ఫ్యూచర్ సిటినా.. లేక రియల్ ఎస్టేట్ సిటినా..?
విశ్వంభర, డెస్క్ /హైదరాబాద్ :- తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేస్తున్న ఫ్యూచర్ సిటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. హైదరాబాద్ నగరానికి భవిష్యత్ రూపురేఖలు ఇస్తామని, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజల్లో మాత్రం మరో ప్రశ్న వినిపిస్తోంది. నిజంగానే ఇది భవిష్యత్ నగరమా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు చేకూర్చే కొత్త ప్రాజెక్టా? అన్న ప్రశ్నలు రేకెతిస్తున్నాయి.
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఫ్యూచర్ సిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలకు పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చేయబోయే కొత్త నగరమని చెబుతుంది. హైదరాబాద్ విస్తరణలో భాగంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించే అవకాశం ఉందని అన్నారు.
అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్, పెట్టుబడుల వివరాలు ప్రజల ముందుకు రాలేదు. దీంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో గతంలో కూడా ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చాయి. ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఐటీ విస్తరణ ప్రాంతాలు అంటూ అనేక ప్రకటనలు జరిగాయి. కానీ వాటిలో చాలా వరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కొన్ని ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. మరికొన్ని భూసేకరణ వరకు వెళ్లి ఆగిపోయాయి.
అందుకే ఫ్యూచర్ సిటీ కూడా అలాంటి మరో ప్రకటన మాత్రమేనా? అనే ప్రశ్నలు ప్రజల మదిలో వ్యక్తమౌతున్నాయి. ఫ్యూచర్ సిటీ ప్రకటన వచ్చిన వెంటనే ఆ ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరాకు కొన్ని లక్షలు పలికిన భూములు ఇప్పుడు కోట్లలో ఉందని మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ ప్రకటనల కంటే ముందే కొంతమంది పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రతి కొత్త ప్రాజెక్టు ప్రకటించినప్పుడు మొదట లాభపడేది రైతు కాదని భూములపై ముందుగానే సమాచారం పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే అనే విమర్శ కొత్తది కాదు. నిజంగా పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తే అభినందనీయమని కానీ భూముల ధరలు పెంచడమే అసలు లక్ష్యమైతే అది ప్రజలతో ఆడుతున్న ఆట కాదా? అని సందేహిస్తున్నారు.
ఏ నగర నిర్మాణమైనా భూముల మీదే జరుగుతుంది. భూమి కోల్పోయేది రైతే. ఫ్యూచర్ సిటీ కోసం వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు.. భూములు ఇచ్చిన రైతులకు దీర్ఘకాలిక భరోసా ఏమిటి? వారికి ఉద్యోగాలు వస్తాయా? వారి పిల్లలకు అవకాశాలు కల్పిస్తారా? లేక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు..