ఎన్ఐఏ కొత్త బాస్‌గా ‘రాకేష్ అగర్వాల్’
పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్‌గా నియామకం
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ (ACC) గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ (ACC) గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఎన్ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయన.. తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆయనను పూర్తిస్థాయి అధిపతిగా ఖరారు చేసింది.
1994 బ్యాచ్‌కు చెందిన రాకేష్ అగర్వాల్‌కు జాతీయ భద్రత, అంతర్గత విద్రోహ చర్యల అణిచివేతలో అపారమైన అనుభవం ఉంది. ఉగ్రవాద నెట్‌వర్క్‌ల గుట్టురట్టు చేయడం, దేశద్రోహ కార్యకలాపాలను విచారించడంలో ఆయనది అందెవేసిన చేయి అనే చెప్పవచ్చు. తాజా నియామకం ప్రకారం ఆయన 2028 వరకు ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు.
గత కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలను ఏరివేసే పనిలో ఎన్ఐఏ అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. రాకేష్ అగర్వాల్ వంటి అనుభవజ్ఞుడైన అధికారి పగ్గాలు చేపట్టడంతో, సంస్థ కార్యకలాపాలకు మరింత పదును పెరగనుందని హోం శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు దాటి వస్తున్న ముప్పులను ఎదుర్కోవడంలో ఆయన నాయకత్వం కీలకమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రస్తుతం ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల పురోగతిపై సమీక్ష జరపనున్నట్లు సమాచారం.



