మరో మూడు రోజుల్లో అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

మరో మూడు రోజుల్లో అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

 

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువు దీరింది. దాంతో గతంలో అందిస్తున్న పథకాలను కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి రైతు అకౌంట్ లోకి రూ.6వేలు మూడు విడుతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. 

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి 

ఇక ప్రధాని నరేంద్రమోడీ మొదటి సంతకం కూడా ఈ స్కీమ్ ఫైల్ మీదనే చేశారు. ఈ నెల 18న పీఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. 17వ విడత కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు ఆయన వివరించారు. వారణాసి పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేస్తారని శివరాజ్ సింగ్ వివరించారు. తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని.. అందుకే ప్రధాని మోడీ తన మొదటి సంతకం కూడా ఈ స్కీమ్ మీదనే పెట్టారంటూ ఆయన వెల్లడించారు.