అనంతపురం ఎస్పీ సస్పెన్షన్ వెనుక అదే కారణమా.. అందుకే వేటుపడిందా? 

అనంతపురం ఎస్పీ సస్పెన్షన్ వెనుక అదే కారణమా.. అందుకే వేటుపడిందా? 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున అల్లర్లు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జేసీ వర్గీయులు ఒకవైపు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు ఒకవైపు పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేసుకోవడమే కాకుండా పెద్దారెడ్డి ఇంటిపై కూడా దాడులు చేయటంతో ఆయన తాడిపత్రి ఖాళీ చేశారు. 

ఇక ఈ గొడవలు చోటు చేసుకున్నటువంటి తరుణంలో అనంతపురం ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నటువంటి అమిత్ బర్దర్ పై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈయనని సస్పెండ్ చేయడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది. తాజాగా తాడిపత్రిలో గొడవలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఓ వర్గం వారు పెద్ద ఎత్తున రాళ్లతో దాడికి దిగారు. 

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

ఇక ఈ దాడిలో భాగంగా పోలీసులపై కూడా రాళ్లు పడటంతో ఎస్పీగా ఈ గొడవలను కంట్రోల్ చేయాల్సింది పోయి ఈ గొడవల నుంచి దూరంగా పారిపోవడంతో సర్వత్ర విమర్శలు తలెత్తాయి. ఇలా ఎస్పీ అక్కడి నుంచి పారిపోవడంతోనే ఆయనపై పై అధికారులు సస్పెన్షన్ వే టు వేసారని తెలుస్తోంది. ఇక ఎన్నికలు జరిగి కూడా దాదాపు నాలుగు రోజులు అవుతున్న ఇప్పటికీ తాడిపత్రిలో గొడవలు మాత్రం సద్దుమనగడం లేదు. దీంతో తాడిపత్రి పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.