కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర

కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర

తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు లేవు.. సుమారు 3వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. అతడే సదాశివాలేఖర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అయితే, సదాశివాలేఖర్ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత జగ్గారెడ్డికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని జగ్గారెడ్డి ఆరాతీయగా తన స్వస్థలం మహారాష్ట్రలోని షిర్డీ అని తెలిపాడు. తాను మణిపూర్ నుంచి బాంబే వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నానని తెలిపాడు. అది విన్న జగ్గారెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు. 

పూర్తి వివరాలు అడగగా తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని సదాశివాలేఖర్ తెలిపాడు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డితో అన్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆయనను అభినందించారు.

Read More గట్టుప్పల్ లో బాపూజీ విగ్రహ ఆవిష్కరణ