తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్

తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్

బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేసరికి అందరికి మొదట గుర్తొచ్చేంది నటి హేమ. నిజానికి ఈ కేసు హేమ కారణంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ.. చివరికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో.. పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా హాజరుకాలేదు. 

 

Read More  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో  ఇంటింటి సర్వే 

అయితే.. ఆమె ఓ సంచలన వీడియో రిలీజ్ చేశారు. తప్పు చేయడనపు దేనకి భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. అలా చెబుతూనే.. తప్పు చేయకుండా ఉండటానికి మనం ఏమైనా దేవుళ్లుమా? అని ప్రశ్నించారు. ఒక తప్పును కవర్ చేయడం కోసం వంద తప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే.. తప్పు ఒప్పుకుంటే మంచింది. లేదంటే వంద అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అని ఆమె చెప్పారు.

 

Read More  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో  ఇంటింటి సర్వే 

అందుకే తాను హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పారు. థింక్ పాజిటివ్.. మనసులో ఏం పెట్టుకోవద్దన్నారు. ఎవరేమన్నా ఊరుకోవద్దని సూచించారు. ప్రస్తుతం హేమ తన ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పు చేయకుండా ఉండటానికి మనం ఏమైనా దేవుళ్లుమా అని అన్నారంటే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకుంటున్నట్టేనని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.