హీరో సిద్దు జొన్నలగడ్డకు సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్

హీరో సిద్దు జొన్నలగడ్డకు సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్

శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని,  ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన యూత్ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి సోగ్గాడు శోభన్ బాబు పేరిట అవార్డ్ ను ప్రదానం చేశారు

నటభూషణ శోభన్ బాబు బౌతికంగా లేకపోయినా తాను నటించిన సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకాభిమానులలో చెరగని ముద్రను వేసుకున్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి పేరిట ఆయన అభిమానులు రెగ్యులర్ గా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి 'సోగ్గాడు' సినిమా స్వర్ణోత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని,  ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన యూత్ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి సోగ్గాడు శోభన్ బాబు పేరిట అవార్డ్ ను ప్రదానం చేయనున్నట్లు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశీ మూవీస్ నరసింహారావు, అడ్వైజర్ జేష్ఠ రమేష్ బాబు, నిర్మాత జె.రామాంజనేయులు, ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, కన్వీనర్స్ సాయి కామరాజ్, పూడి శ్రీనివాసరావు, వీరప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, బి.శ్రీనివాసరావు, యు.విజయ్, కుర్రా రాంబాబు, ధార సత్యం ప్రకటించారు. ఈ ఏడాది ఈ అవార్డ్ కు యువ హీరో సిద్దు జొన్నలగడ్డను ఎంపిక చేసినట్లు, త్వరలో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే వేడుకలో ఈ అవార్డ్ ను ప్రదానం చేయనున్నట్లు వారు వెల్లడించారు.