శర్వానంద్ కు బిరుదు.. పేరు ముందు ఆ స్టార్ ట్యాగ్..!
ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలకు కొన్ని స్టార్ ట్యాగ్ లు ఉంటాయి. మన టాలీవుడ్ లో చిరంజీవికి మెగాస్టార్, పవన్ కల్యాణ్ కు పవర్ స్టార్, ప్రభాస్ కు రెబల్, మహేశ్ కు సూపర్ స్టార్ తో పాటు ఇంకా చాలా మంది హీరోలకు స్టార్ బిరుదులు ఉన్నాయి. అందరికన్నా ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలకే ఉన్నాయనుకోండి అది వేరు విషయం.

అయితే ఇప్పుడు మరో హీరోకు కూడా స్టార్ బిరుదు వచ్చేసింది. ఆయన ఎవరో కాదు శర్వానంద్. చాలా కాలంగా సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్ గానే ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన మూవీ మనమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.
జూన్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ శర్వానంద్ కు ఓ బిరుదును ఇచ్చారు. ఇండస్ట్రీలో మిగతా హీరోల లాగే శర్వానంద్ కు కూడా ఓ స్టార్ బిరుదు ఉండాలన్నారు. ఆయనకు చార్మింగ్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో శర్వానంద్ పేరుకు ముందు చార్మింగ్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు.