తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్: పూజాహెగ్డే

తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్: పూజాహెగ్డే

  • ఏ భాష అయినా కంఫర్ట్‌గానే ఉంటుంది
  • నాకు ఐడెంటిటీని ఇచ్చింది తెలుగు సినిమానే
  • అభిమానులతో చిట్ చాట్‌లో బుట్టబొమ్మ

పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సినిమాలోని ఓ పాటతో ‘బుట్టబొమ్మ’గా బాగా ఫేమస్ అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ఇతర భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. 

తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో పూజాహెగ్డే తెలుగు సినిమాపై తన ప్రేమని బయటపెట్టింది. అందులో ఓ అభిమాని అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా.. నటిగా మీరు ఏ భాషకు ప్రధాన్యత ఇస్తారు? అని అడిగారు. అందుకు పూజా రిప్లై ఇస్తూ ‘నటనకు ప్రాంతీయబేధం అనేది లేదు. ఏ భాషలో అయినా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. అయితే.. తెలుగు సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే. అందుకే తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా చేస్తా.’’ అంటూ చెప్పుకొచ్చిందీ బుట్టబొమ్మ.

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్