ఇవి తింటే మీ కిడ్నీలు పాడైపోతాయ్ జాగ్రత్త

ఇవి తింటే మీ కిడ్నీలు పాడైపోతాయ్ జాగ్రత్త



శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో  కిడ్నీలు ఒకటి. ఈ రోజుల్లో కిడ్ని సమస్య ఎక్కువగా వింటున్నాం. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్ధ  పదార్ధాలను తొలగించడానికి సహాయపడుతాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. కానీ ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీలను రక్షించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ 5 ఆహారాలను తినడం తగ్గించాలి. అవేంటో తెలుసుకుందాం.

Read More పాక నైపుణ్యాలలో చెఫ్ హరీష్ కుమార్ అద్భుతాలు 

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు....  

ఈ రోజుల్లో ఆహారంలో ఎక్కువగా ఉప్పును వాడుతున్నారు. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడి కిడ్నీ సమస్య లు వస్తాయి.

ప్యాక్ చేసిన పండ్ల రసం... 

పండ్ల రసాలను తరుచూ ప్యాక్ చేస్తున్నారు. ఇలా ప్యాక్ చేసిన పండ్ల రసాలల్లో చక్కర స్థాయి ఎక్కువ వుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

పిండి ...

పిండితో చేసిన పదార్ధాలు అంటే బ్రెడ్ పాస్త బిస్కెట్స్ ఇంకా మొదలైనవి తినడం వల్ల శరీరం లో అధిక రక్త పోటు పెరిగి మూత్రపిండాలు దెబ్బతింటాయి.

మద్యం ..

ఈ రోజుల్లో మద్యం ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో కిడ్నీలు కాకుండా మిగతా అవయవాలు కూడా దెబ్బతింటాయి.

రెడ్ మీట్ ...

మాంసాలల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల పై భారం పెరుగుతుంది.