నెరవేరిన దశాబ్దాల కల.. హెచ్ఐవీ టీకా ట్రయల్స్ సక్సెస్
దశాబ్దాల శాస్త్రవేత్త శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. హెచ్‌ఐవీ టీకాను తయారు చేశామని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. టీకాకు సంబంధించిన ట్రయల్స్ కూడా విజయవంతం అయ్యాయని తెలిపారు. టీకా వేసుకున్నవారిలో సమర్థమైన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.
హెచ్ఐవీ టీకా క్లినికల్ ట్రయల్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్‌లో భాగంగా 2019లో 24 మందిని ఎంపిక చేసుకుని వారిలో నలుగురికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు. మిగిలిన 20 మందికి హెచ్ఐవీ టీకా 4 డోసులు వేయాలని డిసైడ్ అయ్యారు. కానీ, మూడు డోసులు వేసుకున్న తర్వాత ఒకరికి అందులో ఉన్న తీవ్రమైన ఎలర్జీ రావడంతో ట్రయల్స్‌ను ఆపేశారు. అయితే అప్పటికే ఐదుగురికి 4 డోసులూ పూర్తి అయ్యాయి. ఇక 15 మందికి 2 డోసుల దగ్గర ఆపేశారు. కానీ.. 2 డోసుల టీకాలు తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. వారిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్టు పరిశోధకులు గుర్తించారు.
హెచ్ఐవీ టీకా తయారీపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కొన్ని నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కానీ.. 1895 నుంచి హెచ్ఐవీ టీకాకు ప్రయత్నించినా ఇంత ఆలస్యం ఎందుకు అయింది అనేది పెద్ద ప్రశ్న. దానిక శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే రోగనిరోధక శక్తి అలర్ట్ అవుతోంది. ఆ వైరస్‌ను అంతచేసే యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తోంది. అయితే.. హెచ్ఐవీ వైరస్ విషయంలో ఇలా చాలా డిఫరెంట్‌గా ఉంది. హెచ్ఐవీ మన శరీరంలో చేరిన తర్వాత యాంటీ బాడీలకు అంతు చిక్కకుండా దాని రూపాన్ని మార్చుకుంటుంది. దీంతో మెడిసిన్ తయారీలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.