తప్పుడు అప్పిడవిట్ దాఖలు - మోసం చేసి గెలిచారంటు పోలారం సర్పంచ్ పై ఆరోపణలు!
విశ్వంభర,షాబాద్:షాబాద్ మండలంలోని పోలారం గ్రామ సర్పంచిగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి గ్రామ ప్రజలను మరియు అధికారులను మోసం చేసినట్లు ప్రత్యర్థి అభ్యర్థి చేగురి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... పోలారం గ్రామంలో గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తన అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి గ్రామ ప్రజలను మరియు ఎలక్షన్ అధికారులను తప్పుదోవ పట్టించాడని ప్రత్యర్థి అభ్యర్థి చేగురి మహేందర్ రెడ్డి ఆరోపించారు.ఎన్నికల సమయంలో తనపై క్రిమినల్ కేసు ఉన్న తన అఫిడవిట్ లో ఎలాంటి కేసులు లేనట్టుగా రాయడం జరిగిందని అలాగే తన ఆస్తులు కానీ తనపై ఉన్న వాహనాలు కానీ తప్పుడు సమాచారం అనగా ఉన్నది లేనట్టుగా తన అఫిడవిట్ లో ధ్రువీకరించాడని ఆరోపించాడు అలాగే ఎలక్షన్ అధికారులు మరియు శ్రీనివాస్ రెడ్డి కుమ్మక్కై ఎన్నికల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముందు సర్పంచ్ అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్ ను తెచ్చుకోమన్నారని తీరా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి తనకు ఏజెంటును కూడా కేటాయించలేదని అలాగే కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా నాకు అనుమానంగా ఉంది మరొకసారి బ్యాలెట్ పేపర్లను లెక్కింపు చేయాలని చేగురి మహేందర్ రెడ్డి కోరగా పోలింగ్ ఆఫీసర్ నిరాకరించాడని తెలిపారు నేను చెప్పింది పెడచెవిన పెట్టి వెంటనే శ్రీనివాస్ రెడ్డికి నియామక పత్రాన్ని అందించాడని మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు . ఈ విషయంపై షాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మరియు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని వీటి పైన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు . సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి తనకు అనుమానం ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా లెక్కించాలని కానీ నేను ఒకేసారి అడిగినా కూడా పోలింగ్ ఆఫీసర్ తిరస్కరించాడని ఆయన ఆరోపించారు దీనిపై మానవ హక్కుల సంఘం లో కూడా ఫిర్యాదు చేశానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించి నాకు న్యాయం చేయాల్సిందిగా వారు మీడియా ముఖంగా తెలిపారు.



