గోపాల మిత్ర నూతన కమిటీ ఎన్నిక

గోపాల మిత్ర నూతన కమిటీ ఎన్నిక

విశ్వంభర, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర గోపాల మిత్ర సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన  కమిటీని హైదరాబాదు మాసాబ్ ట్యాంక్ శాంతి నగర్‌లోని విఈటి హోమ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గోపాల మిత్ర సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సింగ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీ. మల్లేష్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యల్లంముళ్ళ శంభులింగం ను ఎంపిక చేశారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా ఏ. శ్రీరాములు, చేరుకు శ్రీనివాస్, గౌరవ సలహాదారుగా టి. గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బోడ్డు కృష్ణ, కే. రాఘవేంద్ర రెడ్డి, డి. వెంకన్న నాయక్, సహాయ కార్యదర్శులుగా దోమల ముత్తయ్య, పి. అశోక్, పి. నర్సింహా, కోశాధికారిగా గంప శివకుమార్, ప్రచార కార్యదర్శిగా ఆకులు శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా కె. శ్రీనివాస్, వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర గోపాలమిత్ర సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులకు ఏ సమస్య వచ్చినా తమ వంతుగా అండగా ఉంటామని తెలిపారు. సభ్యుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ అసోసియేషన్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తామని చెప్పారు.

Tags: