రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..?

రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..?

విశ్వంభర, మధ్య ప్రదేశ్ : ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల హవా నడుస్తోంది. ప్రముఖ పార్టీలు మధ్య హోరా హోరా పోటీ కొనసాగుతుంది.  అయితే మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో మాత్రం నోటా జోరు కొనసాగుతోంది. ఏకంగా రెండో స్థానంలో దూసుకుపోతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇందౌర్ లోక్ సభ స్థానానికి మే 13న పోలింగ్ జరిగింది.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీ చేయగా... కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ మాత్రం చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది. దీంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది. తద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి శంకర్ లాల్వానీ 10 లక్షల ఓట్లతో 8. 5 లక్షల మెజార్టీతో ముందంజలో ఉండగా...నోట దాదాపు 1.85 లక్షల ఓట్లతో రెండో స్థానంలో ఉంది.

Read More నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు