స్టార్ హోటల్లో గలీజ్ పని.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నలుగురు అమ్మాయిలు (వీడియో)
స్టార్ హోటల్ లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు యువతులను సైఫాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
విశ్వంభర, హైదరాబాద్ క్రైం : అసాంఘిక కార్యక్రమాలకు హైదరాబాద్ అడ్డగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు డ్రగ్స్, మరోవైపు సైబర్ నేరాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న నగరంలో స్పా ముసుగులో వ్యభిచార (Prostitution) కేంద్రాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణ సెక్రటేరియట్( Telangana Secretariat)కు కూతవేటు దూరంలో ఉన్న ఓ హోటల్ స్పాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో నిత్యం హడావిడిగా ఉండే సెక్రటేరియట్‌కు ఎదురుగా ఉన్న అమృత క్యాస్టిల్ హోటల్ (Amrutha Castle Hotel)లో ఉన్న మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్ (Meghvi Wellness Spa Centre ) పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు యువతులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారితోపాటు స్పా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్(Saifabad Police Station)కు తరలించారు.
అమృత కాస్టల్ హోటల్ స్పా సెంటర్లో పోలీసుల దాడులు
సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
స్పా నిర్వాహకుల పై కేసు… pic.twitter.com/FfrunnM80KRead More నూతన ఇంటి గృహప్రవేశం..చిందిన రక్తం— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024



