హాలీవుడ్ నటుడిని కాల్చి చంపిన దుండగులు
అమెరికాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను దుండగులు కాల్చి చంపారు.
అమెరికాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కారులో వెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్ద కాటలిక్ట్ కన్వర్టర్‌ను దొంగిలిస్తుండగా ఎదురుతిరిగిన అతనిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్ వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోగా పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలిపారు. 2007లో ఆర్మీ వైవ్స్ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన వాక్టర్.. జనరల్ హాస్పిటల్ అనే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200 ఎపిసోడ్స్‌లో నటించారు. వెస్ట్‌వరల్డ్, ది ఓ, స్టేషన్ 19, క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్ వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లు, పలు టీవీ షోలలో నటించారు.