యూపీలో దారుణం.. 15ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి..!
ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం హాపూర్ జిల్లా పిలాఖువాలోని ఓ హోటల్‌లో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్తున్న ఓ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం హాపూర్ జిల్లా పిలాఖువాలోని ఓ హోటల్‌లో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.
ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు వివరించగా వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు తనను హోటల్‌కు బలవంతంగా తీసుకెళ్లారని బాలిక ఆరోపించింది. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను బలవంతంగా తాగించారని తెలిపింది.
తాను అపస్మారక స్థితిలోకి వెళ్లాక లైంగిక దాడి చేశారని వాపోయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు వీడియో రికార్డు చేసినట్లు వెల్లడించింది. తాను స్పృహలోకి రాగానే ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని నిందితులు బెదిరించారని పోలీసులతో తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.