BREAKING: హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు..!
ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు.
ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు.
సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.