బరితెగించిన మట్టి మాఫియా
- మహేశ్వరం రెచ్చిపోతున్న మట్టి మాఫియా
విశ్వంభర. మహేశ్వరం : మహేశ్వరంలో రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తూ మండలం కే బి తండా గ్రామంలో మట్టి లారీలు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో పక్కనే ఉన్న ఇంటి పై విద్యుత్ తీగలు పడ్డాయి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ అక్కడున్న గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బయట ప్రజలు ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి అయితే చాలు మట్టి లారీల సౌండ్ వినలేక పోతున్నామని తెలిపారు. మట్టి మాఫియా రెచ్చిపోతున్నా స్థానిక పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కే బి తండాలో ఉప్పుగడ్డ తండాలో సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ భూమిలో మట్టి దందా మాఫియాలు రెచ్చిపోతున్నారు. తండావాసులు రాత్రి అయితే చాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నిద్ర పోవాల్సి వస్తుంది. గతంలో ఎమ్మార్వోకు ఎన్నిసార్లు మట్టి మాఫియా గురించి చెప్పిన పట్టించుకోలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. వెంటనే మట్టి మాఫియా పై తగిన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని ఎందుకు అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ భూముల మట్టిని తరలిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహేశ్వరం, నాగారం గ్రామంలో కూడా అక్రమంగా మట్టి మాఫియా ఆగడాలు జరుగుతున్నాయని వెంటనే అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



