కొండపై ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. క్వారీల్లో తవ్వకాలకు తాత్కాలిక బ్రేక్

  • నేమకల్లు కొండల్లో ఎలుగుబంటి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ
  • ఎలుగుబంటిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు అటవీశాఖ చర్యలు

Rayadurgam News:అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో ఓ ఎలుగుబంటి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి ఎక్కిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు మార్గం లేక శిఖరంపై ఇరుక్కుపోయినట్లు సమాచారం. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎలుగుబంటి భయాందోళనలకు గురికాకుండా సురక్షితంగా సహజ ఆవాసంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు కొండ ప్రాంతంలోని క్వారీల్లో కంకర తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎలుగుబంటికి ఎలాంటి హాని జరగకుండా అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు, క్వారీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/6a604541cfac4/article-19227