పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. కఠిన చర్యలకు ఈసీ ఆదేశం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. కఠిన చర్యలకు ఈసీ ఆదేశం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాల్వాయి గేట్ EVM ధ్వంసం చేసిన ఘటనపై సీరియస్ అయింది. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం వీడియో ఫుటేజ్ ని పరిశీలించిన ఎన్నికల సంఘం .. EVM ధ్వంసం చేసిన ఘటనలో పాల్గొన్న అందరిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన విధ్వంసం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు

బూత్‌లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఓ వ్యక్తి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే పిన్నెల్లి అతడిని బెదిరిస్తూ బయటికి వెళ్లిపోయారు. ఇదంతా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోలు బయటకు రావడంతో సీఈసీ సీరియస్ అయింది. ఇలాంటి దుశ్చర్యలకు భవిష్యత్ ఓ ఎవరైనా పాల్పడాలంటే భయపడేలా చర్యలు తీసువాలని సీఈసీ తేల్చి చెప్పింది.

Tags:

Related Posts