పాలనలో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్.. సలహాలు ఇవ్వాలంటూ క్యూ ఆర్ కోడ్ రిలీజ్

పాలనలో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్.. సలహాలు ఇవ్వాలంటూ క్యూ ఆర్ కోడ్ రిలీజ్

 

Read More వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై సినిమాల్లోనే ఉంటానంటూ ప్రకటన

 

Read More వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై సినిమాల్లోనే ఉంటానంటూ ప్రకటన

పవన్ కల్యాణ్‌ ఇన్ని రోజులు సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక తన దైన మార్క్ పాలన అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికే తన శాఖ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన ఆఫీసులోనే జనతా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు కేటాయించిన శాఖలపై సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ ప్రజల కోసం క్యూ ఆర్ కోడ్ ను విడుదల చేశారు. దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ లో ఫామ్ ను ఫిల్ చేసేలా ఏర్పాటు చేశారు. అందులో ప్రజలు తమదైన సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. 

జనసేనలో పవన్ కల్యాణ్‌ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు, పౌరసరఫరాశాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్‌ బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఈ శాఖలపై పవన్ కల్యాణ్‌ సూచనలు తీసుకోవడం అంటూ ప్రశంసనీయమే అంటున్నారు పలువురు నెటిజన్లు. 

 

Read More వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై సినిమాల్లోనే ఉంటానంటూ ప్రకటన

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా