విజయం దిశగా కూటమి.. కొడాలి నాని కి ఘోర అవమానం 

విజయం దిశగా కూటమి.. కొడాలి నాని కి ఘోర అవమానం 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ కేవలం 23స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తోంది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. 

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. వైసీపీ కంచుకోట రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే లీడ్ రావడం విశేషం. ఇదిలా ఉండగా అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

బిగ్‌ స్క్రీన్‌పై ఫలితాలను విక్షిస్తున్న వారు తెరపై వైసీపీ నేతలు కనిపిస్తే ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో తైరపై కొడాలి నాని కనించగా టీడీపీ తెలుగు మహిళా విభాగానికి చెందిన ఓ కార్యకర్త చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెస్ మీట్‌లలో చంద్రబాబును ఇష్టం వచ్చినట్లుగా తిట్టే కొడాలి నాని ఓటమి చవిచూస్తుండటంతో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

కాగా, ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు వెనుదిరిగారు. గుడివాడలో కొడాలి నానిపై కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా గన్నవరంలోనూ వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు కూటమి అభ్యర్థులకు మెజార్టీ పెరుగుతుండడంతో బందరు కౌంటింగ్ కేంద్రం నుంచి నాని, వంశీలు వెళ్లిపోయారు.

Untitled-13-665e9c0d23f9a

Related Posts