మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

ఏపీ మాజీమంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ(సోమవారం) ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

ఏపీ మాజీమంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ(సోమవారం) ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గతేడాది ఆమె భర్త ఎర్నేని నాగేంద్రనాథ్‌ మృతి చెందడంతో తీవ్ర దు:ఖంలో ఉన్న సీతాదేవి అప్పటి నుంచి అనారోగ్యానికి గురై కోలుకోలేదు. 

ఆమె మృతిపై పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. సీతాదేవి స్వస్థలం ఎపిలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి టిడిపి తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్‌టిఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. యెర్నేని సీతాదేవిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. 

Read More ఘనంగా మున్నూరు కాపు మహిళ సంఘం బతుకమ్మ వేడుకలు

ఆమె భర్త నాగేంద్రనాథ్‌ (చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్‌ సోదరుడు యెర్నేని జారామచందర్‌ రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.