ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు ఘటనల్లో ఇవాళ ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు

మరోవైపు కృష్ణా జిల్లా బాపులపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో నలుగురు మృతి చెందారు. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి వైపు వెళ్తున్న లారీపైకి దూసుకెళ్లింది. కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులు ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

 

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు

చంద్రగిరి మండలంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సి.మల్లవరం జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి వైపు రోడ్డుకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులోని ఇద్దరు ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Related Posts