బాటిళ్లలో పెట్రోల్ పోసిన బంకులు.. చర్యలకు ఈసీ ఆదేశాలు
ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న అల్లర్లతో ఈసీ అప్రమత్తం అయింది. హింసకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. లూజ్ పెట్రోల్ అమ్ముతున్న బంకుపై చర్యలు ప్రారంభించింది. మైలవరం లోని నూజివీడు రోడ్డులో HP పెట్రలో బంక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ బంకులో పెట్రోల్ బాటిళ్లలో వేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అందుకే చర్యలు ప్రారంభించారు. బంకు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం పోలీసులు పలు డిపార్ట్‌మెంట్‌లకు రిఫర్ చేశారు.
ఏపీలో ఇటీవల జరిగిన అల్లర్లలో పెట్రోల్ బాంబులు తయారు చేసినట్టు గుర్తించారు. బాటిళ్లు, టిన్నుల్లో పెట్రోల్ తీసుకొని వెళ్లి.. కళ్ళల్లో పెట్రో బాంబుల తయారు చేశారని తేల్చారు. దీంతో.. లూజ్‌గా పెట్రోల్ అమ్మవద్దని బంకులకు ఆదేశించింది. వాహనదారులు, వినియోగ దారులకు ఎట్టి పరిస్థితుల్లో బాటిల్స్, క్యాన్, టిన్నుల్లో పెట్రోల్, డీజిల్ పూయవద్దని స్పష్టం చేసింది. వాహనాల్లో మాత్రమే డీజిల్, పెట్రోలు పోయాలని ఈసీ ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి పెట్రోలు, డీజీల్ విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
పెట్రోల్ బంక్ లైసెన్సు రద్దుకు సిఫార్సు చేయడానికి కూడా వెనకాడమని తేల్చి చెప్పింది. దీంతో పాటు అన్ని పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలు పనిచేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ.. ఈసీ ఆదేశాలను భేఖాతరు చేసి చాలా మంది బాటిళ్లలో పెట్రోల్ పోస్తున్నారు. దీంతో.. అధికారులు చర్యలకు పూనుకున్నారు.ఈసీ ఆదేశాలకు విరుద్దంగా పెట్రోల్ కొట్టిన బంకులపై కేసులు నమోదు చేస్తున్నారు.