మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్

విశ్వంభర, మంగళగిరి :మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.చంద్ర కిరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags: