వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించొద్దు.. సీఎం చంద్రబాబు

వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించొద్దు.. సీఎం చంద్రబాబు



సీఎం చంద్రబాబు తన ప్రతి మాటలో చాలా మార్పు చూపిస్తున్నారు. గత ఐదేండ్లలో జరిగింది తన పాలనలో ఉండొద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా శనివారం రోజున శాసన సభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడి గురించి మాట్లాడుతూ చంద్రబాబు చాలా కీలక మైన వ్యాఖ్యలు చేశారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

గత ఐదేండ్లలో చూసిన చట్ట సభను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక నుంచి అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు ఉండవని.. సభ అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో చాలా హుందాగా నడవాలని ఆకాంక్షించారు చంద్రబాబు నాయుడు. 

ఇక ఇప్పటి నుంచి ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించడాలు ఉండొద్దని.. కూటమి ఎమ్మెల్యేలు చాలా హుందాగా వ్యవహరించాలని కోరారు చంద్రబాబు నాయుడు. ఇక నుంచి అసెంబ్లీలో ప్రజల సమస్యల మీదనే చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.